--- దోసకాయలు, కీరదోసల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో.., ఇవి తినటం వల్ల డైజెషన్ చాలా సులువుగా జరుగుతుంది.
--- వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీరు మరియు పీచుశాతం అధికంగా ఉంటుంది. ఊబకాయులు వీటిని తినటం వల్ల అధిక బరువు నుండి విముక్తిని పొందవచ్చు. పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడేవారు కూడా దోసకాయలను ఆహారం లో భాగం చేసుకుంటే మంచిది.
--- వీటిలో నీరు మరియు విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లెమ్ ఉండదు. శరీరంలో పేరుకున్న వ్యర్ధ పదార్ధాలను బయటకు పారద్రోలి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.
--- వీటిలో బి1, బి 5, బి 7 విటమిన్లు ఉన్నాయి. దీంతో యాంక్సయిటి, నరాల సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.