భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఇండియన్ డెఫిలియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క్రీడాకారులను కలిశారు. ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక ధామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కిదాంబి శ్రీకాంత్ ను సీఎం జగన్ ప్రశంసించారు. క్రీడల శాఖ మంత్రి ఆర్. కే రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.