అనంతపురం జిల్లా, తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. గుత్తి మండలం జక్కలచెరువు...పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామాలలో వేర్వేరుగా పోలీసులు రౌడీలు, పాత ఎక్సైజ్ కేసుల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గ్రామంలో విజబుల్ పోలీసింగ్ , గ్రామసభ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు. దిశా అప్, రోడ్డు ప్రమాదాలు, సీసీ కెమెరా ఏర్పాటు - ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.