ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మకాయ‌లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:23 PM

- వేసవిలో నిమ్మర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
- నిమ్మకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ల‌భిస్తుంది.
- త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకుంటే వృద్ధాప్య చాయ‌లు త్వర‌గా ద‌రిచేర‌వు.
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది.
- పంటినొప్పిని తగ్గించ‌డంలో నిమ్మర‌సం తోడ్పడుతుంది. చిగుళ్లలోంచి ర‌క్తం వ‌చ్చేవారు త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది.
- నిమ్మరసం మ‌న‌ కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొల‌గించి, శుద్ధి చేయ‌డంలో ఉప‌కారిగా ప‌నిచేస్తుంది.
- స్థూల కాయం ఉన్నవారు రోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
- నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించ‌డంలో కూడా తోడ్పడుతుంది.
- నిమ్మర‌సం యాంటీసెప్టిక్‌ గా పనిచేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com