1. క్లిన్సింగ్: రెండు స్పూన్ల పెరుగుకు, ఒక స్పూన్ అలోవెరా జెల్ ను కలిపి, ముఖానికి రాసుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ముఖంపై పేరుకున్న మురికి మొత్తం పోయి, బాగా శుభ్రపడుతుంది.
2. స్క్రబ్బింగ్: రెండు స్పూన్ల పెరుగుకు, ఒక స్పూన్ పంచదార ను కలిపి, ఐదు నిమిషాలపాటు ముఖంపై రుద్దాలి. ఇలా చెయ్యటం వల్ల ముఖంపై ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
3. ఫేస్ మాస్క్: రెండు స్పూన్ల పెరుగుకు ఒక స్పూన్ కాఫి పొడి, అర స్పూన్ పసుపును కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఒక ఇరవై నిమిషాలపాటు ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
4. టోనర్: అర స్పూన్ పెరుగుకు, రెండు చుక్కల కొబ్బరినూనె, తేనె ను కలిపి ముఖానికి రాయాలి. ఒక అరగంటపాటు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చెయ్యటం వల్ల చర్మం మృదువుగా, కాంతి వంతంగా తయారవుతుంది.