గుంటూరు అర్బన్ ఎస్పీ కె అరిఫ్ హఫీజ్ గురువారం వెస్ట్ సబ్ డివిషన్ పరుధి లోని అరుండల్ పేట పోలీస్ స్టేషన్ లో అకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించారు. కేసులు త్వరితగతిన పరిస్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పోలీసు స్టేషన్ పరిసరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ తో పాటు ఎస్ బి సిఐ శ్రీనివాసరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.