ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతడికి 10 మంది భార్యలు.. ట్విస్ట్ ఏంటంటే

national |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 02:32 PM

ఓ వ్యక్తి దొంగతనాలు చేస్తూ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు విమానాల్లో అనేక నగరాలకు తిరుగుతుంటాడు. ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఓ 15 రోజుల వరకు ఉంటాడు. ఒక్కో నగరంలో ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోవడంతో అతడికి ఇప్పుడు 10 మంది భార్యలున్నారు. బిజినెస్ పని ఉందంటూ అతడు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళతాడు. అక్కడ మరొక భార్యతో కొన్నాళ్లు ఉంటూ.. మళ్లీ బిజినెస్ చూసుకోవడానికి వెళ్తున్నట్లు చెబుతాడు.


వివరాల్లోకి వెళితే.. అతడి పేరు ఇర్ఫాన్. అతడు దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులతోనే ఖరీదైన కార్లను కొన్నాడు. ఆ కార్లతో తిరుగుతూ దాదాపు 10 మందిని వివాహం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కో ప్రదేశంలో ఉంచి కాపురం చేయడం మొదలు పెట్టాడు. ఆస్ట్రేలియాలో ఉంటే ఇండియాలో బిజినెస్ అని, ఇండియాలో ఉన్నప్పడు అమెరికాలో బిజినెస్ అంటూ నమ్మించాడు.


ఇండియాలో అతడిపై చాలా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అతడు పోలీసులకు చిక్కాడు. అతడు తన 10 మంది భార్యల్లో ఒకరి పేరు మీద ఖరీదైన జాగ్వార్ కారు తీసుకున్నాడు. ఆ కారులోనే వెళ్లి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కవినగర్‌ కు చెందిన కపిల్ గార్గ్ అనే వ్యాపారవేత్త నుంచి కోటి రూపాయలు కొట్టేశాడు. దీంతో కపిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కారు నంబర్ ఆధారంగా కూపీ లాగారు.


దీంతో ఆ కారు నంబర్ ఆధారంగా అతడి గుట్టును పోలీసులు బయటపెట్టారు. ఆ కారు ఇర్ఫాన్ భార్య గుల్షన్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఘజియాబాద్ పోలీసులు అతడి ఆచూకీ కనుగొన్నారు. అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్‌, భార్య గుల్షన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇర్ఫాన్ కోసం గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com