హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి చంద్రబాబు నేరుగా విజయవాడ బయలుదేరారు.