ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డు ఉందా? ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 18, 2021, 12:21 PM

ఏపీలో కేవైసీ నిబంధనలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ది దారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ప్రజలు మీ-సేవా కేంద్రాలు, తపాలా కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ-కేవైసీ నమోదు చేసుకోని వారికి రాబోయే రోజుల్లో రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసరాలు అందే వీలుండదు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో 85 శాతం మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయి. ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. పెద్దలు ఆగస్టు నెలాఖరులోగా, పిల్లలకైతే సెప్టెంబర్ నెలాఖరు లోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో రేషన్ కార్డు లబ్ధిదారులు తెల్లవారుజాము నుంచి జనాలు పోస్ట్ ఆఫీస్, మీ-సేవా సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com