ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా వైరస్ పై తస్మాత్ జాగ్రత్త..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 05:42 PM

ఎంత మర్యాదగా, జాగ్రత్తగా చెప్పినా వినడం లేదు. ఇప్పుడు కరోనా పై కను విప్పు మాట చెప్తా వినండి. కరోనాపై అసలు విషయం తెలుసుకోండి ఇది భ్రమ కాదు. జరుగుతున్న వాస్తవం చదువుకొని చదివి పాటిస్తే మంచిది. నువ్వు పట్టుకున్నవన్ని శుద్ధమైన వస్తువులు కాదు. నీ చుట్టు ఉన్న వారు నువ్వు నమ్మేంత పరిశుభ్రమైన ఆరోగ్యవంతులు కారు.


ఇప్పటి వరుకు కరోనా వచ్చిన వారు, వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్లు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు అనుకున్న వారే. కరోనా నాకు దగ్గరగా లేదు అని. ఏమీ కాదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో ఎంతెంతో అభివృద్ధి చెందిన దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. సామాన్యుడి నుండి దేశ అధ్యక్షులు, "అపర కుబేరులు, సెలబ్రిటీలు, వీఐపీలు, చివరకు ఈ వ్యాధికి చికిత్సలు చేసే డాక్టర్లు ఉన్నవారికి బతికే ఛాన్సెస్ ఎక్కువ. హాస్పిటల్ లో చేర్చటానికి నీ వారు ఉండకపోవచ్చు.


ఈ జబ్బు విస్తరించిన తర్వాత కనీసం హాస్పిటల్లో చేరాలంటే బెడ్డు కూడా దొరకడం కూడా కష్టమే. ఒకవేళ నువ్వు హాస్పటల్ లో ఉంటే నీ తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య ఎవరిని కలవలేవు. కలిస్తే వారు కూడా ప్రమాదంలో పడతారు. పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు పుట్టానురా అనుకుంటావ్. ఈ బాధ భరించేకన్నా పోతే బాగుండు అనిపిస్తుంది. కాపాడండి డాక్టర్ అని అరచినా నీ మాట వినటానికి కూడా పక్కన ఎవరూ ఉండక పోవచ్చు ఉన్నా ఎవరూ ఏం చేయలేరు.


ఎందుకు ఈ నిర్లక్ష్యం. ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. అనవసరంగా మన, మనవాళ్ల ప్రాణాలు తీసుకుందామా, బయటికి వస్తే మొహానికి ఖర్చీఫ్, బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత కేవలం ఇంతే. 80 శాతం కరోనా వైరస్ నీదరికి చేరదు. అత్యవసరం అయితేనే బయటకి రండి. మనం బ్రతికి ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. కోలుకోవడానికి, కష్ట నష్టాలను పూడ్చుకోవడానికి, మహా అయితే నెలో, ఏడాదో పడుతుంది భరిద్దాం.


జీవితాన్నే కోల్పోవడం కన్నా జీవితంలో కొన్ని రోజులు కోల్పోవడం మంచిదే కదా. పక్క దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు ఎదురవకుండా చూసుకుందాం. ఆలోచిద్దాం, ఆచరిద్దాం, ప్రాణాలు నిలుపుదాం, ప్రాణాలు నిలుపుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com