ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్క్ లు తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 01, 2021, 01:32 PM

మాస్క్ ప్రస్తుతం సగటు మానవుని దయనందిన జీవితంలో అవసరమైన వస్తువుల్లో ఇదొకటి. ప్రపంచ దేశాలను ముప్ప తిప్పలు పెడుతూ, ఎన్నో ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు మల్లగుల్లలు పడుతున్నాయి. గత సంవత్సరం దేశం మొత్తం మీద కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేసి కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో కష్టాలపడ్డాయి ప్రభుత్వాలు. అయితే అది ఎంతకీ -తగ్గుముఖం పట్టకపోగా మరింత ఎక్కువయ్యింది. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో లాక్ డౌన్ సవరించింది. దీంతో ప్రజల కొంతమేర స్వీయ నియంత్రణతోనే వారి వారి దయనందిన పనులను చేసుకుంటున్నారు.


దుకాణాలు తెరుచుకున్నాయి, రవాణా వ్యవస్త పుంజుకుంది. రెస్టారెంట్లు సైతం పునఃప్రారంభమయ్యాయి. కాగా ఒక్కసారిగా ఒకటికి మూడు రెట్లు కరోనా విజృంభన ప్రారంభం కావడంతో ఖంగుతున్న ప్రభుత్వాలు ఇప్పుడేమి చేయాలో తెలియని పరిస్తితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అన్న సందిగ్ధంలో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. దేశం యావత్తు నగరాలు, పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తూ ప్రజలకు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరళా లాక్ డౌన్ విధించే యోచన లేదని స్పష్టం చేయడంతో జనాలు సంతోషించినప్పటికీ, రోజు రోజుకూ కరోనా విజృంభిస్తుండడంతో కళవరపడుతున్నారు.


ఎక్కడ చూసిన కరోనా పాజిటీవ్ కేసుల మయంగా తయారయ్యింది. దీనంతటికీ కారణం బ్రతుకు తెరువుకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి, తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీలతోనే అని స్పష్టమయ్యింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాలు కంటికి కనిపించని కరోనాతో పోరాటం చేస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి నిబందన అమల్లోకి - ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న కరోనా వైరసను కట్టడి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని గట్టి హుకుం జారీ చేసింది.


ఇందులో భాగంగానే ప్రతీ ఒక్కరూ ఇళ్ల నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు, అపరాధ రుసుం వసూలు చేయాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసాయి. ఆఖరికి దైవ దర్శనం కోసం దేవాలయాలకు వళ్లినప బీడు కూడా భౌతిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు తగిలించుకొని రావాల్సిందేనన్న నిబంధనలు పెట్టాయి. అందువల్ల ఈ కరోనా మహమ్మారి తనంత తానుగా కనుమరుగయ్యేంత వరకూ ప్రజలు దాని భారినుండి బయటపడేందుకు గాను మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఉందని ప్రజలు సైతం డిసైడ్ అయిపోయారు. అంతే కాకుండా ఏవైనా ప్రభుత్వ కార్యాలయా లకు వెళ్లాలన్నా మాస్కు లేనిదే లోపలికే రానివ్వని పరిస్థితులు ఉన్నాయి.


చాలా చోట్ల నోమాస్క్. నో ఎంట్రీ బోర్డులను సైతం ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల వద్ద కనిపిస్తున్నాయి. లాక్ట్రాన్ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మాస్కుల పంపిణీ చేపట్టింది. సగటు మానవుడు జీవన విధానంలో మాస్క్ అవసరం అంతలా ఉంది మరన్నది తెలుసుకోవాలి. ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలపై వెళ్లేవారికి వాహనాలకు సంబందించిన పత్రాలున్నాయా, వారికి లైసెన్లు ఉ న్నాయా లేదా అన్నది పోలీసులు తనిఖీలు చేసేవారు. ఇప్పుడు అందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వాహనాలపై వెళ్లేవారి మూతికి మాస్కు లు ఉన్నాయా లేదా అని పోలీసులు పరిశీలించాల్సిన పరిస్థితులు దాపురించాయి.


విస్తరిస్తున్న మాస్కుల వ్యాపారం - ఇదిలా ఉండగా కరోనా పుణ్యమాని మాస్కులు తప్పనిసరి కావడంతో చాలా దుకాణాలు, వస్త్ర వ్యాపార సముదాయాల్లో మాస్కుల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మాస్కులు నాణ్యతను బట్టి ధరను నిర్ధారించి వ్యాపారులు వాటిని విక్రయిస్తున్నారు. అంతే కాకుండా వివిధ రకాల డిజైన్లు, క్లాలతో తయారవుతున్న మాస్కులు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. మెడికల్ షాపుల్లో మెడికేటెడ్ మాస్కులు, విక్రయిస్తుండగా, ఇతర వాణిజ్య సముదాయాల్లో పలు రకాల మాస్కులు అమ్ముతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com