ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్సిజన్ ధరలు పైపైకి..

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 11:51 AM

పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా లభించకపోవడంతో ఆక్సిజన్‌ ఫిల్‌ చేసుకోవడంలోనూ సమస్యలు తప్పడం లేదు. సిలిండర్‌ ఉన్నా ఫిల్లింగ్‌ చేయడానికి సమయం పడుతుండడంతోపాటు డబ్బులు కూడా అధికంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా భరించక తప్పడం లేదని.. ఇదే విషయమై ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ నిర్వాహకులను అడగ్గా.. వారు నిస్సహాయత ప్రకటిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. గతేడాది కరోనా తొలి వేవ్‌ విజృంభించినప్పుడు కూడా ఆక్సిజన్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, సెకండ్‌ వేవ్‌లో గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 శాతం ధరలు పెరిగాయి. ఆస్పత్రులలో ఆక్సిజన్‌ బెడ్‌లు నిండిపోవడం, డిమాండ్‌ విపరీతంగా పెరగడంతోపాటు హోం ఐసొలేషన్‌లోనూ ఉన్న అవసరం దృష్ట్యా ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com