కరోనా బాధితురాలి పట్ల ఓ మెడికల్ కో ఆర్డినేటర్ నీచంగా ప్రవర్తించాడు. మహారాష్ట్ర ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు పాజిటివ్ రావడంతో అంధేరి ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంటోంది. అయితే అండగా నిలవాల్సిన ఓ మెడికల్ కో ఆర్డినేటర్ ఆమె పై కన్నేశాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని వేధించాడు. దీంతో ఆ మహిళ పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.