జపాన్ కి చెందిన ఓ స్కూల్ గర్ల్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఎంతో బ్యూటీఫుల్‌గా కనిపిస్తూ.. అమాయక చూపులతో కట్టిపడేసిన ఆ అమ్మాయి.. అమ్మాయి కాదని, అబ్బాయి అని తెలిసి ఆ నిజాన్ని నమ్మేందుకు ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు. అబద్ధంలో జీవించడమే తమకు ఇష్టం అంటున్నారు. అంతలా మెస్మరైజ్ చేశాడు ఆమె లాంటి అతడు. అతని పేరు తుకుమా టానీ. వృత్తి పరంగా తకుమా టానీ ఓ సింగర్. అతను రేయ్ డ్యూనోయిస్ పేరుతో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. చాలా సోషల్ మీడియా సైట్లలో అదే పేరుతో ప్రొఫైల్ ఉంది. అమ్మాయిలా డ్రెస్ వేసుకొని.. మేకప్ వేసుకొని అలాంటి ఫొటోలు పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తీరా ఇప్పుడు ఆమె ఆమెకాదని తెలిశాక హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ఫీలవుతున్నారు. తకుమా టానీ.. 18 ఏళ్ల వయసు నుంచి అమ్మాయిలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు అతని వయసు 24 ఏళ్లు.