ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(06-07-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:05 PM

రాశి- మేషం


అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు మందగిస్తాయి. రాబడి అంతగా ఉండదు. శారీరక రుగ్మతలు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు. రియల్‌ఎస్టేట్‌ల వారికి భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవం. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణుల యత్నాలలో ఆటంకాలు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.


రాశి- వృషభం


కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు. రాబడి కొంత తగ్గి అప్పులు కోసం యత్నిస్తారు. కాంట్రాక్టర్లకు చిక్కులు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంతగా అనుకూలంకాదు.


రాశి- మిధునం


అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్నది సాధిస్తారు. ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది..


రాశి- కర్కాటకం


టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంత తీరతాయి.శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రియల్‌ఎస్టేట్‌ల వారికి శుభ వర్తమానాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.


రాశి- సింహం


కొత్తగా రుణాలు చేయాల్సి వస్తుంది. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. బంధువులతో మాటపట్టింపులు.దూర ప్రయాణాలు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం. వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి.


రాశి- కన్య


ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడక తప్పదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఆలయాల సందర్శనం. సోదరులతో అకారణంగా తగాదాలు. శారీరక రుగ్మతలు. రియల్‌ ఎస్టేట్‌ల వారు నిరాశకు లోనవుతారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.


రాశి- తుల


నూతన వ్యక్తుల పరిచయాలు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాకయకం. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో మీకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యా భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.


రాశి- వృశ్చికం


మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు సంభవం. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు. వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం తప్పదు. విద్యార్థులు కష్టానికి ఫలితం కనిపిస్తుంది.


రాశి- ధనస్సు


తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. ఐటీ నిపుణులకు మరింత అనుకూలం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.


రాశి- మకరం


మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. శారీరక రుగ్మతలు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు.


రాశి- కుంభం


పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పాత మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువుల సాయంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి.


రాశి- మీనం


ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే సూచనలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com