కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అన్నదమ్ములు నాగరాజు- నగేష్ ఆ బాధను దిగమింగుకొని తమ జీవితంలో ముందుకు కదిలారు. కానీ, విధి వారిపట్ల కఠినత్వాన్ని మాత్రం ఆపలేదు. ఒకరోజు పనిముగించుకొని ఇంటికి వెళ్తుండగా నగేష్ తన చీలమండలో వాపు గురించి అన్న నాగరాజుకు చెప్పగా అది చిన్నగాయమే అనుకున్నారు. కానీ ఆ నొప్పి ఎంతకూ తగ్గకపోగా నగేష్ నడవలేకపోయాడు. డాక్టర్ ను సంప్రదించగా టెస్టుల తర్వాత అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని, తెల్లరక్తకణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వెంటనే కీమోథెరపీ చేయాలని చెప్పారు. దీంతో వారి జీవితాల్లో మరో కుదుపు వచ్చినట్లైంది. బంధువుల దగ్గర, గ్రామస్థుల దగ్గర అప్పు తీసుకొని నాగరాజు తమ్ముడికి 3 రౌండ్ల కీమోథెరపీ చికిత్స చేయించాడు. తర్వాత డాక్టర్లు క్యాన్సర్ సెల్స్ ఇంకా ఉన్నాయని మరికొన్నాళ్లు చికిత్స చేయాలని, నగేష్ కు తప్పకుండా నయమవుతుందని చెప్పారు. ట్రీట్మెంట్ కు మరో 4 లక్షలు కావాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న నాగరాజు తన తమ్ముడి చికిత్స కోసం సహాయం చేసే ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నాడు. నగేష్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణీస్తోంది. ప్రతీక్షణం వారికి ఎంతో విలువైనది. మీరు చేసే చిన్న సాయం కూడా వారికి చాలా ఉపయోగకరం. దయచేసి సహాయం చేయండి.
-> నగేష్ చికిత్స కోసం సాయం చేయాలనుకునే వారు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.
bit.ly/2BwmF3P
-> మీ ఆర్ధిక పరిస్థితుల వలన మీరు సాయం చేయలేకపోయినా మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా నగేష్ ప్రాణాలు కాపాడడంలో మీ వంతు సాయం చేయగలరు.