ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే సీజనల్ వ్యాధులు దూరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 01, 2020, 03:28 PM

వాతావరణం మారిన ప్రతీ సారి మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రావడం సహజం. వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం వెంటనే మారకపోవడం ఇందుకు కారణం. వాతావరణం మారినప్పుడు... కొత్త కొత్త వైరస్‌లు మన బాడీలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. సాధారణ రోజుల్లో దగ్గు, జలుబును ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. అయితే ఈ కరోనా కాలంలో పరిస్థితి మారింది. దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా కరోనా అనే కంగారు అందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. వాటిని పాటిస్తే సీజనల్ ఫ్లూ, ఇతర అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని వివరించింది. అవేంటంటే.. పసుపు పాలు : గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి. పసుపు మరీ ఎక్కువ అయితే పాలు చేదుగా అనిపించి తాగడం కష్టమవుతుంది. అందుకే... కొద్దిగానే వేసుకోవాలి. పసుపు గొంతులో తిష్టవేసిన వైరస్‌ అంతు చూస్తుంది. అందుకే నిత్యం ఇలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే ముందు పసుపు పాలను తాగి నిద్రపోతే మంచిగా ఉపశమనం కలుగుతుంది. ఆవిరి : మనం ఎంత బలంగా ఉన్నా... మన ముక్కు ఆరోగ్యంగా లేకపోతే... నీరసం రాక తప్పదు. జలుబు కంట్రోల్ అవ్వాలంటే ఓ గిన్నెలో నీళ్లను వేడి చేసి అందులో కాస్త జండూబామ్, అమృతాంజన్, టీట్రీ ఆయిల్, పుదీనా ఆకులు, నీలగిరి ఆకులు, మెంథాప్లస్ లాంటివి ఏవైనా కొద్దిగా కలిపి ఆవిరి పట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె నుంచి వచ్చే ఆవిరిని ముక్కుతో లోతుగా పీల్చాలి. ఇలా ఓ పదిసార్లు చేశారంటే... ఆవిరి ముక్కు రంద్రాల్లోంచీ లోపలికి వెళ్తూ... దారిలోని అడ్డుగా ఉన్న వైరస్‌లు, చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఆ తర్వాత ఒకింత ఊపిరి బాగా ఆడుతున్న ఫీలింగ్ కలుగుతుందని ఆయుష్ తెలిపింది. సీజన్ ఫ్లూ లక్షణాలు: మనకు అనారోగ్యం వస్తే... అది కరోనానా, సీజనల్ ఫ్లూనా అని కనిపెట్టలేం. అందుకోసం వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. కరోనా తీవ్రం అవ్వడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. కాబట్టి మొదటి రెండు రోజులు ఇంట్లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలూ పాటించాలి. ఈ లోగా వచ్చిన సమస్య తగ్గిపోతే అది కరోనా కానట్లేనని అర్థమవుతుంది. సమస్య తగ్గకపోతే అప్పుడు పరీక్షలు చేయించుకోవడం మంచిది. సహజంగా సీజనల్‌లో కింది సమస్యలు వస్తాయని ఆయుష్ తెలిపింది. లక్షణాలు : - ఊపిరి తీసుకోవడంలో సమస్య, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, దగ్గు (పొడి లేదా తడి), ఒళ్లునొప్పులు, తలనొప్పి సీజనల్ ఫ్లూ లక్షణాలు. ఇవి కూడా కరోనా లక్షణాలలాగా అనిపించడం సహజం. కరోనా కూడా ఓ వైరస్సే కావడంతో దానికీ దాదాపు అవే లక్షణాలు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com