తాజ్ హోటల్స్‌కు బాంబు బెదిరింపు

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 02:45 PM
 

ముంబైలో కొలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్, బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ దగ్గర మంగళవారం భారీగా పోలీసులు మోహరించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. టిఒఐ కథనం మేరకు.. పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాజ్ హోటల్స్ లో బాంబు పెడుతున్నట్లు బెదిరించాడు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఎక్కువయ్యింది. రెండు హోటల్స్‌నీ బాంబులతో పేల్చేస్తామని ఎవడో పోలీసుల్ని హెచ్చరించాడు. ఆ వ్యక్తి తనను తాను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తాలూకని చెప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశారు. అది పాకిస్థాన్ నుంచి వచ్చిందని అర్థమైంది. ప్రస్తుతం ఆ రెండు తాజ్ హోటళ్లూ కరోనా కారణంగా మూసివేసి ఉన్నాయి. ముంబై సైబర్ సెల్ అధికారులు ఈ విషయంలో లోతుగా పరిశీలిస్తున్నారు.