ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ అమ్మవారి విగ్రహాలు మాట్లాడతాయి... ఇప్పటికీ వీడని మిస్టరీ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 01:39 PM

400 ఏళ్ల కిందట బస్తర్‌లో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఆలయాన్ని నిర్మించిన రాచ కుటుంబీకులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అలాగే, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆలయం నుంచి పూజారులే మాట్లాడుతున్నారేమో అని భ్రమపడేవారు. అయితే, పూజారులు ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతోంది.ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే, ఆలయ గర్భ గుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా ఆలయాల నిర్మాణంలో కలశ స్థాపన చేస్తారు. అయితే, ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ కలశ స్థాపన చేయలేదు. ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో కనిపిస్తుంది. త్రిపురా, ధూమవతి, బగులముఖీ, తారా, కాలీ, చిన్మస్త, శోదాశీ, మాతాంగి, కమలా, ఉగ్ర తార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఒకప్పుడు ఇళ్ల వరకు ఆ మాటలు వినిపించేవని, ఇప్పుడు ఆలయం సమీపానికి వెళ్తేనే వినిపిస్తున్నాయని తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com