కరోనాతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ కార్పోరేషన్, బి.జే.ఆర్ నగర్ కి చెందిన వ్యక్తి మృతి చెందే కొన్ని నిమిషాల ముందు తన ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో వ్యక్తి మాట్లాడుతూ.. ఊపిరాడడం లేదని చెప్పినా కూడా వినకుండా వెంటిలేటర్ బంద్ చేశారు, ఎంతాగానో బ్రతిమిలాడాను. ఇప్పటికి మూడు గంటలైంది డాడి.. నాకు ఊపిరాడడం లేదు డాడి.. గుండె ఆగిపోయింది డాడి.. ఊపిరొక్కటే కొట్టుకుంటుంది డాడి..బాయ్ డాడి బాయ్..అందరికి బాయ్ డాడి.. అంటూ బాధితుడు చివరి క్షణంలో మాట్లాడిన వీడియో ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తుంది.