ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలై 15 లోగా సీబీఎస్ఈ ఫలితాలు..పరీక్షలు లేకుండానే మార్కులు...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 03:08 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ,10, 12వ తరగతుల్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్‌మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది. ఈ ఫలితాల ఆధారంగానే విద్యార్థులు పైతరగతులకు అడ్మిషన్లు పొందొచ్చు. 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవు. అయితే 12వ తరగతి విద్యార్థులు మాత్రం పరీక్ష రాయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకునేందుకు విద్యార్థులకు సీబీఎస్ఈ కొన్ని రోజుల సమయం ఇస్తుంది. పరీక్ష వద్దనుకునే విద్యార్థులకు జూలై 15 లోగా ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పరీక్ష రాయాలన్న ఆప్షన్ ఎంచుకుంటే వారికి ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది సీబీఎస్ఈ. అయితే ఆ పరీక్షలు ఎప్పుడు ఉంటాయన్న విషయాన్ని త్వరలోనే బోర్డు వెల్లడించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com