ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(24-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 24, 2020, 02:59 PM

రాశి- మేషం


ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీల్లో, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం కారణంగా ఆనందం పొందుతారు. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.


రాశి- వృషభం


అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.


రాశి- మిధునం


పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కుంటారు. గొడవలు, అవమానికి గురవడం, వివాదాల్లో ఇరుక్కోవటం జరుగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది.


రాశి- కర్కాటకం


ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.


రాశి- సింహం


పిల్లల విషయంలో శుభ పరిణామాలున్నాయి. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.


రాశి- కన్య


సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.


రాశి- తుల


చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.


రాశి- వృశ్చికం


కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.


రాశి-ధనస్సు


అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కాని, వ్యవహార శైలి కాని ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.


రాశి-మకరం


కొత్త సమస్యలు ఎదురవు తాయి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.


రాశి-కుంభం


అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. డబ్బు కాని, విలువైన వస్తువులు కాని పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.


రాశి-మీనం


ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కాని వ్యాపారంలో కాని అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com