హనీ ప్రొడక్షన్ బిజినెస్ తేనె ఎక్కువగా ఉత్పత్తి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ చేరింది. 2005-06తో పోలిస్తే భారత్ లో తేనె ఉత్పత్తి గణనీయంగా(242 శాతం) పెరిగింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి రూ .500 కోట్ల నిధులు కేటాయించింది. ప్రస్తుతం మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే ఇది మీకు సదవకాశం. తేనెటీగల పెంపకం కోసం నాలుగు మాడ్యూల్స్ అభివృద్ధి చేశారు. దీని ద్వారా దేశంలో 30 లక్షల మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. మీరు తేనె ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయదలిస్తే ఖాదీ గ్రామోద్యోగ్ KVIC మీకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తుంది. కేవీఐసీ నుండి 65 శాతం రుణం లభిస్తుంది. 25 శాతం సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే, కేవలం 10 శాతం మాత్రమే మీరు ఖర్చు చేయవలసి ఉంటుంది.మీరు ప్లాంటు ఏర్పాటు చేసి ఏడాదికి 20 వేల కిలోల తేనెను ఉత్పత్తి చేస్తే.. ఆదాయం ఎలా ఉంటుందో చూద్దాం. కేజీ తేనె ధర రూ.250గా పరిగణలోకి తీసుకుందాం. అప్పుడు రూ.50 లక్షలు వస్తాయి. ఇందులో 4 శాతం వర్కింగ్ లాస్‌ను పరిగణలోకి తీసుకుంటే.. సంవత్సరానికి రూ.48 లక్షలు లభిస్తాయి. ఇందులో అన్ని ఖర్చులు తీసేస్తే.. రూ.14 లక్షల వరకు మిగులుతుంది. అంటే మీరు నెలకు రూ.లక్షకు పైగా సంపాదించినట్లు అవుతుంది.చూశారు కదా ఇవాల్టి స్వయం ఉపాధి మార్గాన్ని. ఇటువంటి మార్కెటింగ్ ఆధారిత బిజినెస్ ను ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి పూర్తి అవగాహన పొందిన తర్వాత మాత్రమే వ్యాపారం ప్రారంభించవలసిందిగా లోకల్ యాప్ కోరుతుంది.