పల్లీలు.. మన ఆహారంలో భాగమైపోయాయి. కూరలు, అన్నం, చట్నీలు ఇలా అన్నింటిలోనూ పల్లీలును వేసుకుని తినడం మనకు అలవాటుగా మారింది. వీటిని తినడం వల్ల విటమిన్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 100 గ్రాముల పల్లీల్లో 567 కేలరీలు ఉంటాయి. ఓ పరిశోధన ప్రకారం గుండె సమస్యలు ఉన్నవారు కూడా హ్యాపీగా పల్లీలను తీసుకొవచ్చని తేలింది. వీటిని తినడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పల్లీల్లోని అద్భుత గుణాలు హార్ట్ స్ట్రోక్, గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో అమినో యాసిడ్స్ గుండె సమస్యలను దరి చేరకుండా కాపాడతాయి. అందుకే ప్రతి రోజు గుప్పెడు పల్లీలు తినడం మంచిదని చెబుతున్నారు. పల్లీలను తినడం వల్ల మరో ముఖ్య లాభం ఏంటంటే.. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇందులోని అమినో యాసిడ్స్ నాడీకణాలకు మేలు చేస్తాయి. పల్లీల్లో కెరోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల జుట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా పల్లీలు ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే రెగ్యులర్గా వీటిని తినాలి. అంతేకాకుండా వీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి. పల్లీల్లోని ప్రత్యేక పోషకాలు శరీరంలోని చెడు కొవ్వుని తగ్గించి.. మంచి కొవ్వుని పెంచుతాయి దీని వల్ల బరువు తగ్గాలనేకునేవారికి మేలు జరుగుతుంది.