ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహానందిలో పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేత..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:16 PM

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని మహానంది పుణ్యక్షేత్రంలో జ్యేష్ట బహుళ అమావాస్య, ఆదివారం రాహుగ్రస్త చూడామణి నామక పాక్షిక సూర్యగ్రహణం సంభవించినందున గ్రహణ వేధ కారణం చేత మహానంది దేవస్థానం శనివారం రాత్రి 7-00గంటలకు ఆలయంలోని అన్ని ధృవమూర్తులు, ఉత్సవమూర్తులకు సశాస్త్రీయంగా పవిత్ర ధారణ చేసి మూసి వేయబడుతుంది. తిరిగి ఆదివారం (21-6-2020) మధ్యాహ్నం 2-00 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 3-00గంటల తరువాత భక్తులను దర్శనాదులకు అనుమతించ బడతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గ్రహణ సమయం ఉదయం 10-24 నుండి మధ్యాహ్నం 01-54 వరకు ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com