ఏకాంతంగా గడుపుతున్న కాలేజ్ లవర్స్ ను చూడరాని సమయంలో చూసిన ఓ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎక్కడ మా విషయం బయట పడుతుందో అనే భయంతో ప్రియురాలు బయపడింది. మనం కలిసి ఉండటాన్ని బాలుడు చూశాడని, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలని ప్రియురాలు ప్రియుడి దగ్గర బోరున విలపించింది. విషయం మొత్తం నేను చూసుకుంటానని, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లాలని ప్రియురాలికి చెప్పిన ప్రియుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి ముళ్ల పొదల్లో విసేరేశాడు.తమిళనాడులోని తిర్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సోట్టక వుండమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. యువతి, యువకుడు ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో ప్రేమలో పడ్డారు.