అచ్చెన్నాయుడు అరెస్ట్ విధానం ఆక్షేపణీయం అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అంత దారుణంగా తీసుకెళతారా? అని ప్రశ్నించారు. హడావిడిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసే విధానం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యుత్సాహం కాకపోతే ఏంటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకే పోలీసులు అలా వ్యవహరించారని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు.