ప్రస్తుతం ఫోన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఐతే అది కేవలం హెచ్ పీ వినియోగదారులకు మాత్రమే. హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు 9222201122 వాట్సాప్ నెంబర్ ద్వారా సేవలు పొందవచ్చు. అదే విధంగా గత 6 నెలల కాలంలో గ్యాస్ సబ్సిడీ ఎంత డిపాజిట్ అయ్యిందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు వాడారు, ఇంకెన్ని వాడవచ్చు అనే వివరాలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం కేవలం హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు మాత్రమే ఈ సేవలు పొందవచ్చు. తర్వాత అన్ని గ్యాస్ కంపెనీల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మరో నంబర్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.