ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పావురాల నుండి కరోనా సోకుతుందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2020, 12:19 PM

పావురాల్ని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అవి ముద్దుగా, బొద్దుగా ఉంటూ... అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో లక్షల్లో పావురాలున్నాయి. పావురాలకు మేత వేసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఐతే... ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో... పావురాల వల్ల కోరనా వ్యాపిస్తుందా అనే అనుమానం ప్రజల్లో తలెత్తింది. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో మనుషుల నుంచి జంతువులకు, పక్షులకు కరోనా వ్యాపిస్తుందా? ఆలాగే... జంతువులు, పక్షుల నుంచి మనుషులకు కరోనా వ్యాపిస్తుందా అన్నది కచ్చితంగా తేలలేదు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఐతే... పావురాల వల్ల పరోక్షంగా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.


సపోజ్... రోడ్డుపై కొన్ని పావురాలు ఏ ఆహారమో తింటున్నప్పుడు... ఎవరైనా కుర్రాడు వాటిలో ఓ పావురాన్ని పట్టుకున్నాడని అనుకుందాం. దురదృష్టం కొద్దీ అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు, అతని బాడీలో కరోనా వైరస్ ఉంటే... అతను పావురాన్ని ముట్టుకున్నప్పుడు దాని ఈకలపై కరోనా వైరస్ చేరే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత అతను ఓ రెండు నిమిషాల తర్వాత వదిలేశాడని అనుకుందాం. అదే పావురం ఎగురుతూ వచ్చి... ఓ ఇంటి కిటికీ దగ్గర వాలితే... గబుక్కున ఆ పావురాన్ని ఆ ఇంట్లో వాళ్లు పట్టుకుంటే... అప్పటికే పావురంపై ఉన్న కరోనా వైరస్... ఆ ఇంట్లో వాళ్ల చేతులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది.


ఒకవేళ ఆ పావురాన్ని ఆ ఇంట్లో వాళ్లు పట్టుకోకపోయినా... ఆ పావురం... ఆ ఇంటి కిటికీ దగ్గర వాలి... దాని రెక్కల్ని ఆ కిటీకీ ఊచలకో, గ్లాస్ అద్దాలకో రాస్తే లేదా ఆనిస్తే... అలా కూడా వైరస్ ఆ ఊచలకూ, లేదా గ్లాస్‌కూ అంటుకునే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో... పావురాలు రాకుండా ఉండాలని ఎవరైనా ఆ కిటికీ మూసేందుకు వస్తే... పావురం పారిపోయినా... ఆ కిటికీ ఊచలు, గ్లాస్‌ను వారు చేత్తో పట్టుకుంటే... వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... పావురాల వల్ల డైరెక్టుగా కరోనా వైరస్ రాకపోయినా... పరోక్షంగా వచ్చే ప్రమాదం ఉంటుంది.


మరో రకంగా కూడా అనుకోవచ్చు. రోడ్డుపై పావురాలు ఏమైనా తింటున్నప్పుడు... అటుగా వెళ్తూ ఓ కుర్రాడు గట్టిగా తుమ్మితే... ఆ తుంపర్లలో కొన్ని పావురాలపై పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ పావురాలు చుట్టుపక్కల ఇళ్లపై వాలితే... పైన చెప్పినట్లు ఆయా వస్తువులపై పావురాల వల్ల వైరస్ చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... ప్రస్తుతమున్న సమయంలో... పావురాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com