ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ట్రాఫిక్ రూల్స్ గురించి మీకు తెలుసా...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 05:06 PM

ట్రాఫిక్...ట్రాఫిక్..ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ గురించి చాలా ఇబ్బందులు పడుతుంటారు.. వాహనంపై వెళ్తుంటే ఒకరు వేగంగా వెళ్తుంటారు.. మరొకరు సెల్ ఫోన్ తో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు.. ఇంకొకరు రాష్ డ్రైవింగ్ తో ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వారిపై చట్టరీత్యా చర్యలు ఎలా తీసుకోవాలి..అలాంటి సంఘటనలను ఎలా నివారించాలనేది ఎవరికీ తెలియదు. మనకు తెలియని ట్రాఫిక్ నియమనిబంధనలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.. ఇతరులకు అవగాహన కల్పిద్దాం.


వాహనాలను నడపడం గురించి తెలిసినంతగా ట్రాఫిక్ రూల్స్ గురించి చాలా మందికి తెలియదు. కొన్ని ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే మనకు నష్టం, మరికొన్ని ట్రాఫిక్స్ నియమాలను ఉల్లంఘిస్తే ఇతరులకు నష్టం. మనం వాహనం నడుపుతున్నపుడు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు మరియు వాటిని పాటించకపోతే ఎలాంటి జరిమానా చెల్లించాలనే విషయాల గురించి తెలుసుకుందాం...


అనుచితమైన పార్కింగ్


పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలో మీ కారును పార్కింగ్ నుండి బయటకు తీయడానికి ముందు లేదా వెనుక ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే రీతిలో పార్కింగ్ చేసినట్లయితే సమీప పోలీసుకు సమాచారం ఇవ్వచ్చు. మరియు ఆ సంభందిత వాహనం యొక్క డ్రైవర్ రూ. 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో పార్కింగ్ చేయడం మరవకండి.


హారన్ లేని వాహనం


మీ వాహనంలోని హారన్ సరిగా పనిచేయలేదా...? ఈ సంగతి పోలీసుకు తెలిసిందంటే 100 రుపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులను హెచ్చరించేందుకు ఉపయోగపడే హారన్ లేకపోయినా మరియు పనిచేయకపోయినా చట్ట ఉల్లంఘన అవుతుంది.


ఫస్ట్ ఎయిడ్ కిట్


మీరు చెన్నై లేదా కలకత్తా నగరాల్లో మీ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నారా...? అయితే మీ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి. డ్రైవర్ లేదా ప్యాసింజర్లు ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రతమ చికిత్స అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకుండా వాహనాన్ని నడిపితే మూడు నెలల కఠిన కారాగార శిక్ష లేద రూ. 500 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


కారులో సిగరెట్ కాల్చడం


కార్లు కాలి బూడిదైన కేసుల్లో ఎక్కువ శాతం సిగరెట్ కాల్చి పడేయడమే కారణం అని తేలింది. ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో వాహనంలో సిగరెట్ కాలుస్తూ పట్టుబడితే రూ. 100 లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


ప్రజా అవసరాలకు ఆటంకం కలిగిస్తూ పార్కింగ్ చేయడం


బస్టాప్స్ మరియు ఇతర ప్రజా ప్రయోగ ప్రదేశాల్లో మీ వాహనాన్ని పార్కింగ్ చేయటం చట్ట ఉల్లంఘన అవుతుంది. ముఖ్యంగా కలకత్తా నగరంలో ఇలా పార్కింగ్ చేస్తే రూ. 100 ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


ఇతరుల వాహనాలు తీసుకెళ్లడం


బయ్యా చిన్న అవసరం ఉంది ఇప్పుడే వచ్చేస్తాను అని మీ బైకు లేదా కారుని ఎవరికైనా ఇచ్చారా అంతే సంగతులు. ఇలా చేయడం కూడా ఇప్పుడు ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనే. ఇందుకుగాను రూ. 500 ల వరకు జరిమానా లేదంటే ఒక్కోసారి మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.


డ్యాష్ బోర్డులో వీడియో పరికరాన్ని అమర్చడం


సాధారణంగా కారు డ్యాష్ బోర్డులో కార్ల తయారీ సంస్థలు వీడియో తెర గల డివైస్‌లను అందివ్వవు. కారణం డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ ఏకాగ్రత రహదారి నుండి డిస్ల్పే మీదకు మళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కారులో డిస్ల్పే అమర్చకున్నట్లయితే పోలీసులకు పట్టుబడిన రూ. 100 లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


నాన్ మోటార్ వెహికల్స్ కు ఎలాంటి చట్టాలు ఉండవు


ఇంజన్ రహిత వాహనాలపై ఇప్పటి వరకు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ లేవు. వీటిని మోటార్ వెహికల్ చట్టాలలో పొందుపరచలేదు.


ఎన్నికల ప్రచారానికి వాహనాలను ఇవ్వడం


ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు వారి ప్రచార కార్యక్రమాలకు మీ వాహనాలను ఇవ్వచ్చు. దీనికి సంభందించిన ఎలాంటి రూల్స్ లేవు. అయితే పోలింగ్ సమయంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా తరలించడాన్ని నిషేధించారు.


రోజులో రెండు సార్లు ఫైన్ చెల్లించనవసరం లేదు


ఒక రోజులో ఫైన్ చెల్లించిన తరువాత అదే రోజు రెండోసారి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే చెల్లించిన జరిమానా తాలుకు రసీదు మాత్రం తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. ఉదాహరణకు, హెల్మెట్ లేని కారణంగా జరిమానా చెల్లించినట్లయితే ఆ రోజు అర్థరాత్రి వరకు మరో మారు ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే దీని అర్థం ఫైన్ చెల్లించాక హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని కాదు. గుర్తుకోండి... ఎల్లప్పుడు హెల్మెంట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరండి.


సెక్షన్ 10


డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందుగా గాని లేదా గడువు ముగిసిన ఏడాది లోపు గాని , పునరుద్ధరించుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తరువాత అప్లై చేస్తే మళ్ళీ పరీక్ష పాస్ కావలసి ఉంటుంది.


సెక్షన్ 22


18 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారు వాహ‌నం న‌డిపితే వాహన రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు నిషేదించే అవ‌కాశ‌ముంది. ఆ తరువాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి.


సెక్షన్ 58


మొద‌టి సారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ 100 గా ఉన్న జరిమానాను రూ 500 వరకు, రెండవ తప్పుకు రూ 300 గా ఉన్న జరిమానాను రూ 1,500 గాను పెంచడమైనది .


సెక్షన్ 59


కొత్త నిబంధనల ప్రకారం రోడ్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమాన రూ. 500 నుఁడి రూ 1,000 వరకు ఉంటుంది.


సెక్షన్ 60:


టికెట్ లేని ప్రయాణానికి జరిమానాను రూ . 200 నుండి రూ 500 లకు పెంచడమైనది.


సెక్షన్ 61:


ప్రభుత్వ అధికారిక‌ ఉత్తర్వులను నిర్ల‌క్ష్యం చేస్తే జరిమానాను రూ 500 నుండి రూ 2,000 లకు పెంచడమైనది .


సెక్షన్ 62


లైసెన్స్ లేకుండా అనుమతి లేని వాహనం నడిపితే జరిమానాను రూ 1,000 నుండి రూ 5,000 లకు పెంచడమైనది .


సెక్షన్ 64:


అర్హత కోల్పోయినా కూడా వాహనం నడిపితే జరిమానాను రూ 500 నుండి రూ 10,000 లకు పెంచడమైనది .


సెక్షన్ 65


కొత్త చట్టం ప్రకారం అనుమతిలేని మోటార్ వాహనాల తయారీ, నిర్వహణ, అమ్మకం, మార్పులు చేసినచో రూ 5,000 ల వరకు జరిమానా .


సెక్షన్ 66


అతి వేగంగా వాహనం నడిపితే లైట్ మోటార్ వాహనాలకు రూ 1,000 నుంచి రూ 2,000 ల వరకు, మధ్యస్థ వాహనాలకు (ప్రయాణీకులతో గాని లేదా వస్తువులతో గాని) రూ 2,000 ల నుంచి రూ 4,000 ల వరకు జరిమానా. రెండవ సారి జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ జప్తు చేయబడుతుంది.


సెక్షన్ 67


ప్రమాదకరంగా వాహనాన్ని నడిపితే మొదటి తప్పుగా రూ 1,000 నుంచి రూ 5,000 లు జరిమానా లేదా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష గాని లేదా రెండు అమలు చేస్తారు. రెండవ తప్పుగా రూ 10,000 లు జరిమానా లేదా రెండు సంవత్సరాలు జైలు శిక్ష గాని లేదా రెండు అమలు చేస్తారు.


సెక్షన్ 68


మద్యం సేవించి వాహనం నడిపితే మొదటి తప్పుగా ఆరు నెలల వరకు జైలు శిక్ష గాని లేదా రూ 10,000 ల వరకు జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. రెండవ తప్పుగా రూ 15,000 లు జరిమానా లేదా రెండు సంవత్సరాలు జైలు శిక్ష గాని లేదా రెండు అమలు చేస్తారు.


సెక్షన్ 69


మానసికంగా గాని లేదా శారీరకంగా గాని అనుమతిలేని పరిస్థితులలో వాహనం నడిపితే మొదటి తప్పుగా రూ 1,000 వరకు జరిమానా , రెండవ తదుపరి తప్పులకు రూ 500 నుంచి రూ 2,000 లు జరిమానా విధిస్తారు.


సెక్షన్ 70


ప్రమాదానికి కారణమైనందుకు మొదటి తప్పుగా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ 5,000 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు. రెండవ తప్పుగా ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ 10,000 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు.


సెక్షన్ 71


రేసింగ్ , అతి వేగానికి మొదటి తప్పుగా ఒక నెల వరకు జైలు శిక్ష లేదా రూ 500 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు. రెండవ తప్పుగా ఒక నెల వరకు జైలు శిక్ష లేదా రూ 10,000 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు.


సెక్షన్ 72


అసురక్షితమైన పరిస్థితులలో వాహనాన్ని నడిపితే , తగిన జరిమానా విధిస్తారు.


సెక్షన్ 75


సరైన అనుమతి పత్రం లేకుండా వాహనాన్ని వాడితే మొదటి తప్పుగా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ 10,000 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు. రెండవ తప్పుగా ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ 10,000 ల వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు.


సెక్షన్ 77


సరైన అనుమతి లేకుండా ఏజెంట్లు గాని ప్రచారకులు గాని వాహనాన్ని న‌డిపితే వాటికి త‌గిన‌ జరిమానా విధిస్తారు.


సెక్షన్ 78


పరిమితికి మించి బరువుతో వాహనం నడిపితే తగు విధంగా జరిమానా విధిస్తారు


సెక్షన్ 79


పరిమితికి మంచి ప్రయాణికులు , సేఫ్టీ బెల్టులు, సీట్ బెల్టులు పిల్లలకు కూడా ఉపయోగించకపోవడం, మోటార్ సైకిల్ నడిపేవారు, వెనకకూర్చున్నవారు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, అధిక లోడ్ ఉన్న వాహనాలను తనిఖీ చేయనివ్వకపోవడం, నిశ్శబ్ద ప్రాంతాలలో మొబైల్ ఫోన్ వాడకం, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం వంటి వాటికి తగు విధంగా జరిమానా విధిస్తారు.


సెక్షన్ 81


బీమా లేని వాహనాన్ని నడిపినందుకు మొదటి తప్పుగా ప్రస్తుతమున్న జరిమానాను రూ 1,000 లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు కలిపి , నుంచి జరిమానాను రూ 2,000 లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు కలిపి పెంచారు. రెండవ తప్పుకు జరిమానాను రూ 4,000 లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు కలిపి పెంచారు


సెక్షన్ 82


ఇతరుల వాహనాన్ని అనధికారంగా తీసుకుంటే జరిమానాను రూ 500 నుండి రూ 5,000 లకు పెంచడమైనది.


సెక్షన్ 83


అనధికారంగా ఏ వాహనాన్నీ అడ్డుకున్న జరిమానా రూ. 100 నుంచి రూ. 1,000 లకు పెంపు.


సెక్షన్ 85


వాహనాన్ని మైన‌ర్లు నడిపినట్లైతే జరిమానా రూ 25,000 అలాగే మూడు సంవత్సరాల జైలు శిక్ష . వాహన రిజిస్ట్రేషన్ ను 12 నెలల పాటు నిషేధించడమవుతుంది. అటువంటి పిల్లలకు 25 సంవత్సరాల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వరు.


సెక్షన్ 87


ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే జరిమానా గంటకు రూ. 50 నుంచి రూ 500 పెంచడమైనది .


రోడ్ ట్రాన్స్ పోర్ట్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం . రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నియమ నిబంధలను రూపొందించుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం...తొందరపాటు...మితిమీరిన వేగమే. ఒక్క క్షణం దీనిపై యువత ఆలోచించాలి. హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ తప్పక ధరించాలి. రోడ్డు నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com