ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవిచంద్రన్‌ అశ్విన్‌ సరసన చేరిన చహల్‌ !

national |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 04:23 PM

పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా (51 వికెట్లు) రికార్డును కూడా చహల్‌ అధిగమించాడు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో బుమ్రా (51 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అశ్విన్‌ 46 మ్యాచుల్లో 52 వికెట్లు తీయగా.. చహల్‌ 35 మ్యాచుల్లోనే పడగొట్టడం విశేషం. శ్రీలంక స్పి​న్నర్‌ అజంత మెండీస్‌ 26 మ్యాచ్‌లలోనే 50 వికెట్లు తీసాడు.  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మట్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు (52) తీసిన ఆటగాడిగా మరో స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరసన చేరాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ వికెట్‌ సాధించడంతో చహల్‌ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 32 మంది బౌలర్లు 50కి పైగా వికెట్లు సాధించారు. ఈ జాబితాలో టీమిండియా తరుపున అశ్విన్‌, బుమ్రా, చహల్‌లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్‌, హెట్‌మెయిర్‌ను ఒకే ఓవర్‌లో చహల్‌ పెవిలియన్‌కు చేర్చిన విషయం తెలిసిందే. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌లుగా అశ్విన్‌, చహల్‌లు ఉన్నారు. రెండో టీ20లో ఒక్క వికెట్ తీసినా చహల్‌ రికార్డులోకి ఎక్కుతాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com