ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ విడుదల చేశారు. మొదటి ఏడాది పరీక్షలు మార్చి 4 నుంచి 21 వరకు, రెండో ఏడాది పరీక్షలు మార్చి 5 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ విద్యార్థులతోపాటు వొకేషనల్ విద్యార్థులకూ ఇవే తేదీలు వర్తిస్తాయి.