తెలుగుదేశం నేత నారా లోకేష్ మరో సారి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసారు. ఈ మేరకు ట్విట్టర్ లో రాసుకొచ్చారు."జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి. వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు. 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదు.భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారు. వరద వలనే ఇసుక దొరకడం లేదు అని చిలక పలుకులు పలుకుతున్న జగన్ గారు భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుంది. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉంది." అని లోకేష్ రాసుకొచ్చారు.