ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి నూతన కార్యవర్గం…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:14 PM

అంబాజీపేట మండల బిజెపి నూతన కార్యవర్గ వర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక అయ్యింది. పుల్లేటికుర్రుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణ సుందర్ స్వగృహంలో మండల ఉపాధ్యక్షుడు కొల్లూరి చంటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బి.జె.పి.రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ ప్రత్యేక అధితి గా పాల్గొన్నారు. మండల అధ్యక్షునిగా పసుపులేటి సూరిబాబు, ఉపాధ్యక్షునిగా పెయ్యేటి శీను, కార్యదర్శిగా నేదునూరి పెద్దిరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా నక్కా త్రిలోచన రావు వ్యవహరించారు. వీరిని బిజెపి జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు కొల్లి సూర్యారావు స్థానిక నాయకులు ఆకెళ్ళ సూరిబాబు, రామకృష్ణ, అశోక్ మణికంఠ తదితరులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com