ఆటోను వెనుక నుండి బైక్ ఢీకొనడంతో బైక్ పై ఉన్న యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ప్రకాశం అద్దంకిలో చోటు చేసుకుంది. మండలంలోని చక్రాయపాలెం సమీపంలో చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్ పట్నంలోకి బైక్‌పై వస్తుండగా.. ముందు వెళుతున్న ఆటోకు కుక్క అడ్డురావడంతో ఆటో నెమ్మదైంది. ఆటో వెనుక వస్తున్న బైక్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడి కాలు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు రిమ్స్‌కు తరలించారు.