ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడి అనుకుని టాయిలెట్‌కు పూజలు చేసిన భక్తులు!

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 07:16 PM

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహా గ్రామ ప్రజలు గత ఏడాదిగా ఓ కాషాయ రంగులో ఉన్న భవనాన్ని గుడిగా భావించి పూజలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆ భవనం తలుపులు తీయకపోవడంతో అందులో దేవుళ్ల విగ్రహాలు ఉండి ఉంటాయని భావించారు. దీంతో తలుపుల వద్దే పూజలు చేయడం ప్రారంభించారు. చివరికి అది టాయిలెట్ల భవనం అని తెలుసుకుని షాకయ్యారు. ఈ సందర్భంగా స్థానికుడు రాకేష్ చందేల్ మాట్లాడుతూ.. ‘‘కమ్యునిటీ హెల్త్ సెంటర్‌ను ఆనుకుని ఈ టాయిలెట్‌ను నిర్మించారు. దీని డిజైన్ కూడా ఆలయం రూపంలోనే ఉంటుంది. పైగా, దీనికి కాషాయం రంగు వేయడంతో ప్రజలంతా ఆ భవనాన్ని ఆలయంగా భావించేవారు. ఇటీవల గ్రామానికి వచ్చిన అతిథులు.. ఇది కాదు టాయిలెట్ అని చెప్పేవరకు ప్రజలు నమ్మలేదు. దీంతో ఆ టాయిలెట్‌కు పింగ్ రంగు వేయించారు’’ అని తెలిపాడు. ఏడాది కిందటే ఈ టాయిలెట్ పూర్తయినా అనివార్య కారణాల వల్ల దాన్ని ప్రారంభించలేదు. అప్పటి నుంచి ఆ టాయిలెట్ ప్రారంభానికి నోచుకోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రారంభిస్తారా అనే ప్రశ్నకు కూడా అధికారుల వద్ద సమాధానం లేదు. అయితే, ఈ టాయిలెట్‌కు ప్రభుత్వమే కాషాయ రంగు వేయించిందా లేదా కాంట్రాక్టరే నేతలను మెప్పించేందుకు ఆ రంగు వేశాడా అనేది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com