చెన్నైలో భారీ వర్షాలు!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 09:42 AM
 

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, పుదుకోట్టై, నాగపట్నం, కడలూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరులో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భవానీసాగర్‌ డ్యామ్‌ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నీలగిరి, సేలం, నామక్కల్‌, దిండిగల్‌, రామనాథపురం జిల్లాల్లో.. స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కన్యాకుమారి, తిరుసల్వేలి జిల్లాల్లో పర్యాటక జలపాతాలను అధికారులు మూసివేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.