ఈజిప్టులో బయటపడ్డ 3000 ఏండ్లనాటి 30 శవపేటికలు

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 09:20 PM
 

ఈజిప్టులో 30 పురాతన శవ పేటికలు బయటపడ్డాయి. ఇవన్నీ రెండు వరుసల్లో కేవలం ఒక మీటరు లోతులో దొరికాయి. ఇవి ఒకే కుటుంబానికి చెంది ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. శవపేటికలు మతాధికారులకు చెందినవి కావచ్చని, దాదాపు 3000 ఏండ్ల క్రితం నాటివని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలైనా వీటిపై చిత్రించిన ఆకృతులు ఏమాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం.