ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ షాక్

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 11, 2019, 09:37 AM
 

పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు  పాక్ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ షాకిచ్చింది. అతడి నలుగురి అనచరులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో సయీద్‌కు అత్యంత సన్నిహితులైన జాఫర్ ఇక్బాల్, హఫీజ్ యాహ్యా అజీజ్, ముహమ్మద్ అష్రాఫ్, అబ్దుల్ సలాంలు ఉన్నారు. పాక్‌లోని పంజాబ్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం వీరిని అదుపులోకి తీసుకుంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కోరిన పాక్ భంగపడింది. మరోవైపు, పాక్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పాక్ చర్య ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.