సాహిత్యంలో ఇద్ద‌రికి నోబెల్ పురస్కారాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 11, 2019, 02:15 AM
 

2019 సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారం విజేత పీటర్ హాండ్‌కే
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది సాహిత్యరంగంలో విజేతగా నిలిచిన పీటర్ హ్యాండ్‌కే అత్యంత ప్రభావంతమైన రచయితగా గుర్తింపు పొందినట్లు స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.భాషలతో మానవుడి అనుభవంను మేళవించి అందులో విశిష్టతను వెలికి తీయడంలో ప్రతిభ చాటినందుకుగాను పీటర్ హాండ్‌కేను ఈ అవార్డు వరించిందని స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది. దక్షిణ ఆస్ట్రియాలోని ఓ చిన్న గ్రామంలో 1942లో పీటర్‌హాండ్‌కే జన్మించారు. పీటర్ హాండ్‌కే స్లొవేనియన్ మైనార్టీలకు చెందిన వారు.


2018 విజేత ఓల్గా టోకర్ జక్ఇ
దిలా ఉంటే 2018కి గాను సాహిత్య రంగంలో నోబెల్‌ బహుతి ఓల్గా టోకర్‌జక్‌ను వరించింది. సరిహద్దులు దాటడం జీవితంలో ఓ భాగం అని చెబుతూ ఓ చక్కటి కల్పిత కథనం రాసినందుకు ఓల్గాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. నోబెల్ పురస్కారాలు అందుకున్న మహిళల్లో ఓల్గా 15వ మహిళ కావడం విశేషం. ఓల్గా 1962లో పోలాండ్‌లో జన్మించారు.1993లో ఆమె నవలలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 11 నోబెల్ పురస్కారాల విజేతలను అకాడెమీ ప్రకటించింది.ఇందులో విజేతలంతా పురుషులే కావడం విశేషం.