భారత్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఖరార్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 09, 2019, 12:49 PM
 

భారత్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 11-12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడి, జిన్‌పింగ్‌ లు తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాధినేతలు చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భేటీ జరిగే వేదికతో పాటు ఆ ప్రాంతమంతా కొత్త హంగులతో కళకళలాడుతోంది. ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం ఉన్నతాధికారులు ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రెండు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ ను ప్రధాని మోడి భారత్‌ కు ఆహ్వానించారు. ప్రపంచ చరిత్రాత్మక వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా యునెస్కో గుర్తింపు పొందిన మహాబలిపురాన్ని చివరికి ఖరారు చేశారు.