గృహహింస ఆరోపణలతో భారత పేసర్ మహ్మద్ షమి వీసాను అమెరికా తిరస్కరించింది. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగి షమికి తిరిగి వీసాను ఇప్పించింది. అమెరికా రాయబార కార్యాలయానికి బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి ఈ విషయంపై లేఖ రాసి షమి వీసాకు క్లియరెన్స్ ఇప్పించాడని తెలుస్తోంది. దేశం తరఫున షమి సాధించిన విజయాలు, పోలీస్ రిపోర్టును లేఖలో పేర్కొన్నారు. దీంతో పీ1 కేటగిరి కింద షమికి వీసా లభించింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అథ్లెట్స్‌కు పీ1 కేటగిరి వీసాను ఇస్తారు. ‘మహ్మద్ షమి వీసాను అమెరికా ఎంబసీ తొలుత తిరస్కరించింది. పోలీసు ధృవీకరణ రికార్డు అసంపూర్తిగా ఉండటంతో జరిగింది. దీనిపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యర్థిస్తూ లేఖను రాశారు. ప్రపంచకప్‌లో షమి సాధించిన విజయాలను కూడా లేఖలో పొందుపర్చారు.’ అని బీసీసీఐ ఒక అధికారి తెలిపారు.
గతంలో షమి భార్య హసీన్ జహాన్ షమిపై గృహహింస వేధింపుల కేసును పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో షమి నాలుగు మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్థాన్‌పై హ్యాట్రిక్ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు.