ఆస్ట్రేలియా మాజీ మిస్వరల్డ్ ఎస్మా వొలోడర్((2017) పోచంపల్లిని సందర్శించారు. కను ముక్కుల గ్రామ పరిధిలో గల పోంచపల్లి హ్యాండ్లూమ్ పార్కులో చేనేత మగ్గాలపై చీరల తయారు విధానాన్ని స్కిల్నూలు వార్పుపై టైఅండ్డై విధానంలో తయారు చేస్తున్న గ్రాఫిక్ డిజైన్లను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి చేనేత వస్త్రాల తయారీ విధానం గురించి ఆమె తెలుసుకున్నారు. పోచంపల్లి చేనేత ఉత్పత్తులు అద్భుతమని కితాబునిచ్చారు. కాగా పార్క్ డైర్టర్ భారత లవకుమార్ వారికి హ్యాండ్లూమ్ పార్క్ నుండి వివిధ యూరోపియన్, అమెరికా తదితర దేశాలకు చేనేత ఇక్కత్ వస్త్రాల ఎగుమతి గురించి వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రదర్శించి చేనేత వస్త్రాల ప్రాముఖ్యత తెలియజేసేందుకు చేనేత ఉత్పత్తులను సేకరించినట్లు ఆమె వెంట ఉన్న అంతర్జాతీయ ఫిలాన్త్రో పిస్ట్ డా.సతీష్సిక్కా తెలిపారు.