ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పన చేసిన హువావే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2019, 02:44 PM

ఐక్యరాజ్యసమితి ఆంక్షలను కాదని ఇరాన్ కు సాంకేతిక సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా చైనా కంపెనీ హువావేపై కొరడా ఝుళిపించింది. హువావే ఉత్పత్తులకు సేవలను ఆపేయాలని తమ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమెరికా చర్యకు దీటుగా బదులు ఇచ్చేందుకు చైనా కంపెనీ సిద్ధమయింది. తాజాగా  గూగుల్ అందించే అండ్రాయిడ్ ఓఎస్ కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్ మెంగ్ ఓఎస్’ను అభివృద్ధి చేసినట్లు హువావే తెలిపింది. ఈ ఓఎస్ అండ్రాయిడ్ కంటే 60 శాతం వేగంగా పనిచేస్తుందని వెల్లడించింది.  ప్రస్తుతం ఓఎస్ తుది పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఈ ఏడాది అక్టోబర్ కల్లా అన్ని హువావే ఉత్పత్తులకు ‘హాంగ్ మెంగ్ ఓఎస్’ ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత తమ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ సేవలు లభించవని స్పష్టం చేసింది. దాదాపు 22.50 కోట్ల మొబైల్ ఫోన్లలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయనున్నారు. మరోవైపు వివో, ఒప్పో కంపెనీలు ఈ ఓఎస్ ను పరీక్షించేందుకు తమ బృందాలను పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ హాంగ్ మెంట్ ఓఎస్ ట్రేడ్ మార్కు కోసం హువావే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలతో పాటు యూరప్ లో దరఖాస్తు చేసింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com