ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదుల అనుసంధానం ద్వారా నీటి కొరత నివారిస్తాం : ప్రధాని మోడీ హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2019, 03:00 AM

 శం లోని అన్ని నదుల అనుసంధానాన్ని రానున్న ఎన్డీయే ప్రభుత్వం చేపడుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు . లోక్సభ ఎన్నికల తొలి దశ గురువారం నుంచి ప్రారంభం కానుండడం తో మోడీ ఎన్నికల ప్రచారాన్ని  ముమ్మరం చేస్తూ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో పలు ఎన్నికల సభలలో ప్రసంగించారు. ఈ రెండు రాష్ట్రాలలో నీటి ఎద్దడి అధికం వున్న దృష్ట్యా నీటి లభ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మోడీ రోసా ఇచ్చారు వాజపేయి ప్రభుత్వం లో తల పెట్టిన నదుల అనుసంధానం అంశాన్నిప్రధాని మోడీ తెర పైకి తెచ్చారు. రానున్న రోజుల్లో నీటి యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని, అందరికి నీటి లభ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు అందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ని ఏర్పాటు చేస్తామని, నదుల అనుసంధానం కోసమే ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని ప్రధాని మోడీ వివరించారు. సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ సోమవారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక లో నదుల అనుసంధానం  కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేస్తామని హామీ యిచ్చిన విషయం తెలిసిందే మహారాష్ట్ర లోని
లాతూర్ లో జరిగిన బహిరంగ సభ లో ప్రసంగిస్తూ దేశంలోని అన్ని ఇళ్లకు, అన్ని పంట పొలాలకు నీరు అందించడానికి నదుల అనుసంధానమే సరైన పరిష్కారమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లాతూర్ బహిరంగ సభ లో శివ సేన నేత ఉద్దావ్ థాకరే కూడా పాల్గొన్నారు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక ను కాంగ్రెస్ పార్టీ విమర్శించడం పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని, గతం లో శివ సేన నేత బాల్ థాకరే ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీ దొంగిలించిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ను ప్రస్తావిస్తూ  కాంగ్రెస్
పార్టీ పాకిస్థాన్ భాషలో మాట్లాడుతోందని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వోట్ బ్యాంకు కోసం దేశ భద్రతను కూడా విస్మరిస్తున్నారని మోడీ
విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని తొలగించవద్దని కాంగ్రెస్ వాదిస్తోందని , పాకిస్థాన్ బాష లో మాట్లాడుతోందని ప్రధాని మోడీ దుయ్య బట్టారు. మొదటి సారి ఓటు హక్కు వియోగించుకుంటున్న   యువ ఓటర్లను ఆకట్టుకోడానికి మోడీ ప్రయత్నించారు.
బాలాకోట్ పై వైమానికదాడులు  దాడులు చేసిన వారికే యువ ఓటర్లు తమ మొదటి ఓటు ను వేయాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసారు.అదేవిధంగా పుల్వామా దాడులలో అమరులైన వారికీ యువ ఓటర్లు తమ మొదటి ఓటును అంకితం చేయాలని ప్రధాని మోడీ కోరారు. యువ ఓటర్లు తమ మొదటి ఓటు ని జీవిత కాలం గుర్తుంచుకుంటారని ప్రధాని మోడీ చెప్పారు. పేదలకు పక్క ఇళ్ళు కట్టించేవారికి, పంట  పొలాల్లో రైతులకు నీరందించే వారికి యువ ఓటర్లు తమ మొదటి ఓటును వేయాలని ప్రధాని మోడీ అప్పీల్ చేసారు. అదే విధంగా అందరికి ఆరోగ్య భద్రత, ఆయుష్మాన్ భారత్ పధకానికి యివా ఓటర్లు వోట్ చేయరా అని మోడీ ప్రశ్నించారు.


జమ్మూ కాశ్మీర్ కు వేరే ప్రధాని కావాలని డిమాండ్ చేస్తున్న వారితో కాంగ్రెస్, ఎన్సీపీ చేతులు కలపడాన్ని ప్రధాని మోడీ విమర్శించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పిస్తూ మరాఠా నేత శరద్ పవార్ అలంటి వారితో ఎలా చేతులు కలుపుతారని విస్మయం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే నమ్మకంగా చేసే పని అవినీతి ఒక్కటేనని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వారి దగ్గర కరెన్సీ నోట్ల కట్టలని ఆదాయపు పన్ను  అధికారులు పట్టుకోడాన్ని   ప్రస్తావిస్తూ ఓట్లు కొనడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి అని మోడీ వ్యాఖ్యానించారు. గత ఆరునెలలుగా చౌకీదార్ దొంగ అయ్యాడని వారు ప్రచారం చేస్తున్నారని, అయితే ఈ నోట్ల కట్టలు ఎక్కడివి, అసలు దొంగ ఎవరు అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.
 జాతీయవాదానికి , రైతు సంక్షేమానికి బీజేపీ  కట్టుబడి ఉందనిమోడీ పునరుద్గాటించారు." గత 5 ఏళ్లుగా మీరు ప్రదర్శించిన విశ్వాసమే తాను
సాధించిన పెద్ద ఘనత" అని ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com