ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ నిర్మాణమే రాహూల్ లక్ష్యం- ఎన్.తులసిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2019, 07:21 PM

ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రకటించిన కుటుంబ ఆదాయ భరోసా పథకం మీద ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్ట‌ర్ ఎన్.తులసిరెడ్డి ఒక ప్రకటన విడుద‌ల చేశారు.  ప్రపంచంలో,దేశంలో మొట్టమొదటి పథకమన్నారు.  పేదరికాన్ని ఈ పథకం ద్వారా శాశ్వాతంగా నిర్మూలించి,నేరుగా నెలకు 6వేలు చొప్పున కుటుంబంలోని మహిళ బ్యాంక్ ఖాతాలో జమ చేయ్యటమే ఈ పథకం ఉద్దేశమన్నారు. దాదాపు 5 కోట్ల కుటుంబాలకు, 25 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ఈ పథకం పని సంసృతికి వ్యతిరేకమని,ద్రవ్యక్రమశిక్షణ దెబ్బతీస్తుందని, ఎప్పటికి అమలు కాదని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ పేర్కొనడం దారుణమన్నారు. ఒక పైపు 25మంది సంపన్నులకు మేలు చేసేందుకు మోది ప్రభుత్వం పూనుకుందని, రాహూల్ 25 కోట్లమంది పేదలను ఆదుకోవడానికి ప్రవేశపెడుతున్నారన్నారు. ఇప్పుడు ఈ 20 శాతాన్ని కనీస ఆదాయ భరోసా పథకంతో నిర్మూలించి దారిద్రరహిత భారత్ నిర్మాణానికి రాహూల్ కృషి అభినందనీయమన్నారు. ఈ పథకంతో రాహూల్ ప్రధాని అవుతారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com