విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి యాగం ప్రారంభించారు. ఆదివారం ఉదయం సింహాచలం దేవస్ధానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో దేవస్థాన వేద పండితులు విఘ్నేశ్వర పూజా పుణ్యాహ వాచనం కలశారాధన చేసి నరసింహస్వామి యాగానికి అంకురార్పణ చేశారు. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అయిన విజయనగర రాజ వంశానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు నాగలి పట్టుకొని భూమి పూజ చేశారు ఆలయ వేదపండితులు మాట్లాడుతూ నరసింహ యాగం లోక కల్యాణార్థమై చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ ఏఈవో ప్రసాదరావు దేవస్థానం సిబ్బంది మరియు ఆగమ పండితులు పాల్గొన్నారు.