నెల్లూరు జిల్లాలో సెల్ఫోన్ల లోడ్ చోరీ అయ్యింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఉన్న శ్రీ సిటీ నుంచి మొబైల్స్ లోడ్‌తో ఓ లారీ కోల్‌కతాకు బయల్దేరింది. లారీ దగదర్తి జాతీయ రహదారిపైకి రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. డ్రైవర్‌ను లారీలో నుంచి కిందకు దించి సమీపంలోని చెట్టుకు కట్టేశారు. తర్వాత లారీతో సహా అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత సెల్ఫోన్లు ఎత్తుకెళ్లి ఖాళీ లారీని జాతీయ రహదారిపై వదిలి వెళ్లారు. డ్రైవర్‌ను చెట్టుకు కట్టేయడంతో అతడ్ని గమనించిన స్థానికులు విడిపించారు. మాయమైన మొబైల్ ఫోన్స్ విలువ రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.