పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ ఏటా నిర్వహించే పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు ఈనెల 21వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను, త్యాగాలను కొనియాడుతూ స్మారకోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధమయ్యిందన్నారు. జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధుల్లో స్మారకోత్సవాలు నిర్వహించనున్నారు.