ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రాశుల వారిపై అయిదు గ్రహాల అనుగ్రహం

Astrology |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 02:24 PM

గ్రహాల అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయనే విషయం తెలిసిందే. మనకు సంబంధించిన రాశుల్లో గ్రహ సంచారం బాగుంటే.. మన జాతకచక్రం కూడా బాగుంటుందని చెబుతూ ఉంటారు.అయితే ఒక గ్రహం అనుకూలంగా ఉంటేనే భారీగా ఉత్తమ ఫలితాలు వస్తే, అదే అయిదు గ్రహాలు అనుకూలంగా ఉంటే.. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.మొత్తం తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాల అనుగ్రహం ఒకేసారి కలగడం అనేది ఏ రాశి వారికైనా గొప్ప విషయమే. అలానే ఇప్పుడు అయిదు గ్రహాల అనుగ్రహం నాలుగు రాశులపై ఉంది. ఈ సమయంలో ఆయా రాశుల వారికి అస్సలు తిరుగుండదు. వారు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు ఏవేవి? ఆ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


 


ఆ రాశులు ఏవంటే?


మేష రాశి: ఈ రాశి వారికి గురువు, కుజుడు, రవి, బుధుడు, శని గ్రహాలు అత్యంత అనుకూలంగా మారాయి. దీని వల్ల నవంబర్ 15వ తేదీ వరకు మేష రాశి వారికి అనుకూలమైన రోజులు ఉండనున్నాయి. ఈ సమయంలో మేష రాశి వారి ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా గడిస్తారు. నష్టాల్లో ఉన్నవారు కూడా లాభాల బాట పడతారు.ఈ కాలంలో మేష రాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ కాలంలో ఎక్కువగా శుభవార్తలు వింటూ ఉంటారు.


వృషభ రాశి: ఈ రాశి వారికి రాహువు, గురువు, రాశ్యధిపతి శుక్రుడు, కుజుడు, శని గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. దీని కారణంగా వృషభ రాశి వారికి అత్యంత లాభాల కాలం నడవనుంది. ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి భారీగా లాభాలు వచ్చే అవకాశముంది.


వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకొని, అనుకున్న విధంగా లాభాలను రాబట్టుకుంటారు. ఇంట్లో వారందరూ శుభవార్తలు వింటూ ఉంటారు. కొద్దీ ప్రయత్నంలో సొంతింటి కల నెరవేరే అవకాశముంది. పెళ్లికాని వారికి ఇది మంచి సమయం. పెళ్లిళ్ల కుదిరే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి.


కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురువు, బుధుడు, రవి, శుక్రుడు, కేతువు గ్రహాలు చాలా అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ కాలం నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. వీటి కారణంగా ఈ రాశి వారు విదేశీ సొమ్మును లబ్ధిపొందే అవకాశముంది. ఉద్యోగులు వేరే ఉద్యోగంలో మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఉండిపోయిన ఆస్తి సమస్యలు పరిష్కారమై.. విలువైన ఆస్తులు కలిసిరానుంది.


నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.


వృచ్చిక రాశి: ఈ రాశి వారికి శని, గురువు, కుజుడు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా మారాయి. దీని కారణంగా వృచ్చిక రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఈ గ్రహాల అనుకూలత కారణాంగా ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలోనే కాక కుటుంబంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి పాస్తులు పొందుతారు.


నిరుద్యోగులకు అనేక మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంపన్నమైన కుటుంబంతో పెళ్లి సంబంధాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com